'అర్జీల పరిష్కారానికి అధికారులు పనిచేయాలి'
E.G: రాజమండ్రి నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 22 అర్జీలు స్వీకరించినట్లు కమిషనర్ శ్రీ రాహుల్ మీనా తెలిపారు. అర్జీలను ఆయా శాఖల అధికారులకు అప్పగిస్తూ, క్షేత్రస్థాయిలో విచారణ చేసి సత్వర, సంతృప్తికర పరిష్కారాలు అందించాలని ఆదేశించారు. అలాగే పెండింగ్ అర్జీలపై నిరంతర ఆడిట్ నిర్వహించాలన్నారు.