గన్నవరంలో ఫుడ్ కమిషనర్ పర్యటన

కృష్ణా: గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులాని ఫుడ్ కమిషనర్ విజయ ప్రతాప్ రెడ్డి బుధవారం సందర్శించారు. మెస్, వంటశాల, పరిసరాల పరిశీలనతో పాటు విద్యార్థులతో చర్చించి వారి అవసరాలను తెలుసుకున్నారు. ఉప్మా బదులు ఎగ్, ఫ్రైడ్ రైస్ వంటి ఐటమ్స్ మెనూలో చేర్చాలని విద్యార్థులు ఆయనను కోరారు. ప్రిన్సిపాల్, టీచర్ల పనితీరును ఆయన ప్రశంసించారు.