పేదల సొంతింటి కల నెరవేర్చుతాం: మంత్రి

పేదల సొంతింటి కల నెరవేర్చుతాం: మంత్రి

SS: పెనుకొండలో ఇళ్ల స్థలాలు లేని పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఇవాళ పెనుకొండలో మీడియాతో ఆమె మాట్లాడుతూ.. పట్టణంలో మొదటి విడతగా 1500 ఇళ్లు కొత్త నిర్మాణాలు చేపట్టామన్నారు. అందులో 90 ఇళ్లకు భూమి పూజ చేశామని పేర్కొన్నారు. అయితే ప్రతి ఇంటికీ రూ. 2.50 లక్షలతో నిర్మాణం చేపడుతున్నామన్నారు.