యాదాద్రి శ్రీవారికి భారీ ఆదాయం

యాదాద్రి శ్రీవారికి భారీ ఆదాయం

యాదాద్రి: శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో వెంకట్రావు వెల్లడించారు. శనివారం సుమారు 48 వేల మంది భక్తులు దర్శించుకోగా.. రూ.50,84,453ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణకట్ట, వ్రతాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చింది.