పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: మేడికొండూరు మండలం పేరేచర్లలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గతంతో పోల్చితే పత్తి క్వింటాకు రూ. 520 పెంపు చేసినట్లు తెలిపారు. గతంలో పత్తి క్వింటా ధర రూ. 7,521 కాగా, ప్రస్తుతం రూ. 8,110గా ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.