పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
CTR: జీడీనెల్లూరు మండలంలో విషాదం నెలకొంది. రామానాయుడు పల్లికి చెందిన బాబు అనే రైతు పురుగు మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన భూమిని అన్యాయంగా ఆక్రమించడంతో పాటు కేసుల పేరుతో వేధించారని తెలుస్తోంది. ఈ ఘటనపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వేధించడంతో ఇలా చేశారని సమాచారం. ఆత్మహత్యకు ముందు రైతు ఓ లేఖ రాశారని స్థానికులు చెబుతున్నారు.