వడదెబ్బతో వ్యక్తి మృతి
NGKL: తాడూరు మండలం యంగంపల్లిలో వడదెబ్బతో అంతటి అంజనేయులు అనే వ్యక్తి మృతి చెందారు. ఇవాళ ఎలక్ట్రిషియన్ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన, చన్నీటితో స్నానం చేసిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.