వెలిగండ్లలో నీటి సమస్యకు పరిష్కారం
ప్రకాశం: వెలిగండ్ల గ్రామ పంచాయతీలోని సూరవారిపల్లిలో తాగునీటి సరఫరా చేసే నీటి బోర్ మోటారు, స్టార్టర్ పెట్టె కాలిపోయాయి. గ్రామ ప్రజలు సర్పంచ్ సురేశ్ బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రావణ సంధ్యకు విషయం తెలిపారు. నీటి మోటారుకు మరమ్మతులు చేసి ప్రజలకు నీటి సమస్య లేకుండా చేశారు. వెంటనే స్పందించిన అధికారులకు ప్రజలు అభినందనలు తెలిపారు.