పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత

NZB: కమ్మర్ పల్లి మండల పరిధిలో ఇటీవలి కాలంలో దొంగతనానికి గురైన రెండు మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటిని బాధితులకు శనివారం స్థానిక ఎస్సై జి. అనిల్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. మొబైల్ ఫోన్లు చోరీకి గురైన బాధితులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా తమ ఫోన్లను ట్రాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉందని వివరించారు.