షార్ట్ సర్క్యూట్‌తో పంట దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో పంట దగ్ధం

ADB: ఇచ్చోడలోని కామగిరికి చెందిన రైతు జాదవ్ హరిభ తన 4 ఎకరాల్లో జొన్న సాగు చేశాడు. పంట కోతకు సిద్ధమైన తరుణంలో సోమవారం వీచిన భారీ గాలి దుమారానికి విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి 4 ఎకరాల పంట పూర్తిగా కాలిపోయిందని వాపోయాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.