కోడి వ్యర్థాల వాహనం సీజ్

ELR: భీమడోలు మండలం కురెళ్లగూడెం బ్రిడ్జి వద్ద కోడి వ్యర్థాల వాహనాన్ని ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎస్‌ఐ మాట్లాడుతూ.. గ్రామంలో గణేశ్ అనే వ్యక్తి చేపల సాగు చేస్తున్నాడు. ఆ చెరువుకు కోడి వ్యర్థాలను తరలిస్తుండగా వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేశామన్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.