లలిత కళల్లో శిక్షణ

లలిత కళల్లో శిక్షణ

WGL: జేఎన్ఎస్లోని బాలభవన్లో గురువారం నుంచి జూన్ 6 వరకు వేసవి ప్రత్యేక తరగతుల్లో భాగంగా లలిత కళల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా బాలభవన్ సూపరింటెండెంట్ ఝాన్సీ తెలిపారు. ప్రతీరోజు ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు మృదంగం, నృత్యంలో శిక్షణ ఉంటుందన్నారు. 5 -16 ఏళ్ల వయస్సు గల బాలబాలికలు అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9912500516 నంబర్ సంప్రదించాలన్నారు.