జిల్లాలో 94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి: కలెక్టర్
తూ.గో: జిల్లాలో నవంబర్ నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శనివారం విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,35,060 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు కాగా, తొలి రోజునాటికి 2,20,948 మందికి పంపిణీ పూర్తయిందన్నారు. శనివారం రాత్రి 8 గంటలకు పంపిణీ 94%గా నమోదైందన్నారు.