రాష్ట్రపతి ముర్ము చారిత్రక పర్యటన షురూ

రాష్ట్రపతి ముర్ము చారిత్రక పర్యటన షురూ

ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆఫ్రికా దేశమైన బోట్స్వానాకు చేరుకున్నారు. భారత రాష్ట్రపతి బోట్స్వానాకు చేసిన మొదటి పర్యటన ఇదే కావడం విశేషం. ఈ పర్యటన ద్వారా ముర్ము చరిత్ర సృష్టించారు. బోట్స్వానా రాజధాని గ్యాబరోన్ చేరుకున్న రాష్ట్రపతికి సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.