డ్రోన్‌లతో పేకాట,గంజాయి వాడకంపై కఠిన చర్యలు
అన్నమయ్య: జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో మంగళవారం నిఘా పెంచారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు రాయచోటి, రాజంపేట, మదనపల్లె డివిజన్లలో పట్టణాలు, శివారు, నేర ప్రోన్ ప్రాంతాలపై డ్రోన్ పర్యవేక్షణ కొనసాగుతోంది. పేకాట, గంజాయి వినియోగం, బహిరంగ మద్యం సేవనంపై కఠిన చర్యలు చేపట్టనున్నారు.