విజయవాడలో 300కు చేరిన డయేరియా కేసులు

NTR: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితుల సంఖ్య 300కు చేరింది. గత రాత్రి మరో 20 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో, వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 145 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు.