'7వ మహాసభను జయప్రదం చేయాలి'
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో ఈ నెల 3న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య మహబూబాబాద్ జిల్లా 7వ మహాసభను నిర్వహించనున్నట్లు సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీశైలం తెలిపారు. శనివారం మండల కేంద్రంలో CPI (ML) నాయకులతో కలిసి మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మహాసభకు కళాకారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.