రేపు గుంటూరు మిర్చియార్డుకు జగన్

రేపు గుంటూరు మిర్చియార్డుకు జగన్

GNTR: వైసీపీ అధ్యక్షుడు జగన్ బుధవారం గుంటూరు నగరానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మిరప పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మిర్చియార్డులో సాగుదారులతో మాట్లాడనున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి.