రేపు కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం

రేపు కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం

కర్నూలు: సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి.సృజన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారని తెలిపారు.