15 మంది ఎస్సైలు బదిలీ

15 మంది ఎస్సైలు బదిలీ

కర్నూలు రేంజ్‌లోని పలు పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న 15 మంది ఎస్సైలను బదిలీలు చేపట్టినట్లు సోమవారం డీఐజీ డా.కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫారసుల మేరకు ఈ బదిలీలు అమలులోకి వచ్చాయి. బదిలీ అయిన ఎస్సైలను వెంటనే రిలీవ్ చేసి, కొత్త విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను ఆదేశించారు.