గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్న 10 మంది అరెస్ట్

ములుగు జిల్లా: మంగపేట మండలంలోని మల్లూరు లక్ష్మీనృసింహస్వామి ఆలయం పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్న 10 మంది ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుట్టపై కొంత కాలంగా అటవీ అభివృద్ధి పనులు చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారితో పాటు జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన 10 మంది ముఠాగా ఏర్పడి గుట్టపై గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు.