'ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి'
నెల్లూరు జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా గన్నీ బ్యాగులు, GPS రవాణా వాహనాలను సిద్ధం చేయాలని సూచించారు.