'ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే వ్యక్తులను ఎన్నుకోవాలి'
BDK: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిజాయితీ పరులను ఎన్నుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పాల్వంచ దంతల బోర ఎస్సీ కాలనీ బండ్రిగొండ గ్రామపంచాయతీలలో CPM బలపర్చిన అభ్యర్థుల విజయం కోసం జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని, మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి జవాబుదారితనంగా పనిచేయగలిగే వ్యక్తులను ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు.