'రాష్ట్రంలో దౌర్జన్య పాలన కొనసాగుతోంది'

'రాష్ట్రంలో దౌర్జన్య పాలన కొనసాగుతోంది'

గద్వాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జ్ బాసు హనుమంతు నాయుడుని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శనివారం ఆయన ఇంటికి వెళ్లి నిర్బంధించిన పోలీసుల తీరుపై బాసు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో దౌర్జన్య పాలన కొనసాగుతోందని, అక్రమ అరెస్టులు చేసి మంత్రులు జిల్లాలో పర్యటించడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.