VIDEO: పిడుగుపాటుకు ఇద్దరు మృతి

గుంటూరు: మండలంలోని మూలకలూరులో విషాదం నెలకొంది. గ్రామ పొలాల్లో మంగళవారం పిడుగుపడిన ఘటనలో ఇద్దరు గొర్రెల కాపరులు మృతిచెందారు. కుందులవారిపాలెంకు చెందిన కోటేశ్వరరావు, సంతమాగులూరుకు చెందిన గోపి గ్రామ సమీపంలో ఉన్న పొలంలో గొర్రెలను మేపడానికి వెళ్లారు. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు ఏర్పడి పిడుగుపడింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారాని గ్రామస్తులు పేర్కొన్నారు.