VIDEO: వలకు చిక్కిన భారీ కొండ చిలువ

HNK: ఐనవోలు మండలం వడ్డెరగూడెం గ్రామ శివారులోని గుట్టల్లో గురువారం ఉడుముల కోసం వేసిన వలలో భారీ కొండచిలువ చిక్కింది. గ్రామస్తులు గుర్తించి ఈ విషయాన్ని పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకొని అధికారులు కొండచిలువను సురక్షితంగా రక్షించి జూపార్క్‌కు తరలించారు.