బండి సంజయ్ సభకు అనుమతి
TG: కేంద్రమంత్రి బండిసంజయ్ బోరబండ సభకు తాజాగా పోలీసులు అనుమతి మంజూరు చేశారు. ఈ సందర్భంగా బోరబండ సైట్ 3లోని సభా ప్రాంగణంలో కేంద్ర బలగాల మోహరించాయి. కాగా, అంతకుముందు బోరబండలో బండి సంజయ్ నిర్వహించబోయే సమావేశానికి పోలీసులు అనుమతి రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడిన విషయం తెలిసిందే.