పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
కోనసీమ: అమలాపురం పట్టణంలోని ప్రధాన బస్టాండ్‌ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేయాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్-1లో జరిగిన ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పలు కీలక ప్రజా సమస్యలను ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.