'మరో ఉపాధ్యాయుడిని నియమించాలి'

'మరో ఉపాధ్యాయుడిని నియమించాలి'

అల్లూరి: కొయ్యూరు మండలం కొత్తపల్లి ఎంపీపీ పాఠశాలకు మరో ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. పాఠశాలలో 28 మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. వీరికి ఒకరే టీచర్ బోధిస్తున్నారన్నారు. పిల్లల సంఖ్య దృష్ట్యా మరో టీచర్‌ను నియమించాలన్నారు. శనివారం సర్పంచ్ ఎస్.చంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని సర్పంచ్ తెలిపారు.