జనవరిలో మహిళలకు క్రికెట్ టోర్నమెంట్: ఎమ్మెల్యే
ATP: మహిళా క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ గెలుపొందడంతో తాడిపత్రిలో సంబరాలు మిన్నంటాయి. సోమవారం ఉదయం పుట్లూరు రోడ్డు సర్కిల్ వద్ద ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి సమక్షంలో మహిళలు కేక్ కట్ చేసి విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు జనవరిలో సీనియర్, జూనియర్ విభాగాల్లో టోర్నమెంట్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు.