సామూహిక వందేమాతరం గేయాలాపానలో పాల్గొన్న తహసీల్దార్

సామూహిక వందేమాతరం గేయాలాపానలో పాల్గొన్న తహసీల్దార్

GDWL: ధరూర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వందేమాతరం గేయాలాపన సామూహికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నరేందర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చి, మన హృదయాల్లో దేశభక్తిని వెలిగించిన వందే మాతరం గేయానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తయింది అన్నారు. ఈ గేయాన్ని 1875లో బంకించంద్ర ఛటర్జీ రాశారు అని తెలియజేశారు.