అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: ఎమ్మెల్యే

అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించాలి: ఎమ్మెల్యే

NGKL: లింగాల మండల కేంద్రంలో డా.బిఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చదువుకొని అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.