ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

SDPT: చేర్యాల మండలం వీరన్నపేట స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకుకూరల వ్యాపారి తొడెంగుల నర్సింహులు TVS లూనాపై VSR నగర్ వైపు వెళ్తుండగా జనగామ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న స్విఫ్ట్ కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.