మల్కంచెరువు వద్ద వాటర్ స్పోర్ట్స్

మల్కంచెరువు వద్ద వాటర్ స్పోర్ట్స్

RR: రాయదుర్గంలోని మల్కంచెరువుకు మహార్దశ రానుంది. ఈ చెరువులో త్వరలో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ బోటింగ్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. వాటర్ సైక్లింగ్, జెట్ అటాక్, ఫెడల్ బోట్లు, ఫ్లై బోర్డింగ్ వంటివి ఉండనున్నాయి. తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ మల్కం చెరువులో పర్యాటక ఆకర్షణ కలిగిన స్పోర్ట్స్ నిర్వహణకు అనుమతించాల్సిందిగా GHMCని కోరింది.