వినాయక చవితి ఉత్సవాలపై సమావేశం

KRNL: వినాయక ఘాట్ వద్ద వినాయకుడి ఆలయంలో గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కార్యదర్శులు వేణుగోపాల్, గోరంట్ల రమణలు శనివారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. వచ్చే నెల సెప్టెంబర్ 4న వినాయకుని నిమజ్జనం కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలపై పోస్టర్లు కూడా ఆవిష్కరించారు.