జిల్లాలో రైతులకు సరిపడా యూరియా: కలెక్టర్

జిల్లాలో రైతులకు సరిపడా యూరియా: కలెక్టర్

WNP: జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వ ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. రైతులు ఆందోళన పడకుండా ప్రస్తుతం అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకెళ్లేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పానగల్ మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాంను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల గోదాంలో సేల్ రిజిస్టర్‌ను పరిశీలించారు.