మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురుకి జైలు శిక్ష
KDP: కలసపాడు మండలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ముగ్గురు మందు బాబులకు శుక్రవారం కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. మోను కుమార్‌కు ఏడు రోజులు, సయ్యద్ సైదుమియా 3 రోజులు జైలు, కమలాపురం ప్రసాద్‌కు 10 వేల జరిమానా విధించినట్లు బద్వేల్ కోర్టు తీర్పు ప్రకటించింది. ఎస్సై తిమోతి మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై హెచ్చరించారు.