రేపు పెద్దపల్లి మార్కెట్ బంద్
PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుమారుడు అకాల మరణం నేపథ్యంలో సంతాపంగా గురువారం పత్తి మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు కమిటీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి రేపు పత్తి విక్రయాల కోసం మార్కెట్ యార్డుకు రావద్దని సూచించారు.