రైలు పట్టాలపై రెండు మృతదేహాలు లభ్యం
అన్నమయ్య: కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. రైలు పట్టాలపై మృతదేహాలు ఉన్నట్లు తిరుపతి-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్ లోకో ఫైలట్ మదనపల్లె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతులు సోమల(M) ఇరికిపెంటకు చెందిన ముని కుమార్, కలికిరి(M) ఆచార్ల కొత్తపల్లికి చెందిన వీర భద్రయ్యగా గుర్తించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.