దిత్వా తుఫాన్.. 510 మందికిపైగా మృతి

దిత్వా తుఫాన్.. 510 మందికిపైగా మృతి

దిత్వా తుఫాన్ శ్రీలంకకు శోకాన్ని మిగిల్చింది. వర్షాల ప్రభావంతో కొండచరియలు విరిగిపడటం, వరదల వల్ల ఇప్పటి వరకు 510 మందికిపైగా మృతి చెందారు. మరో 386 మంది ఆచూకి గల్లంతైంది. శిథిలాల కింద చాలా మంది ఉండే అవకాశం ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా 50 వేలకు పైగా ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.