మల్లాపూర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

HYD: డివిజన్ పరిధిలోని బ్రహ్మపురి కాలనీలో, నాగలక్ష్మి నగర్ కాలనీ, మల్లాపూర్ ఐడిఏ ప్రధాన రోడ్డులో భూగర్భ డ్రైనేజి సమస్యకు శాశ్వత పరిష్కారంగా 42 లక్షల రూపాయలతో చేపట్టిన భూగర్భ డ్రైనేజి పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పోరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డిలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, నాయకులు పాల్గన్నారు.