'గ్రామానికి రావొద్దు.. ప్రచారం చేయొద్దు'

'గ్రామానికి రావొద్దు.. ప్రచారం చేయొద్దు'

ASF: జైనూర్ మండలం మార్లవాయి సర్పంచ్ అభ్యర్థి ట్రాన్స్ జెండర్ పెందోర్ సంతోష్( సాధన) తనకు కొందరు రాజకీయ నేతలు, వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆరోపించారు. సోమవారం ఎస్పీ, కలెక్టర్‎ను కలిసేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడుతూ..కొందరు రాజకీయ నేతలు, వ్యక్తులు తనను గ్రామానికి రావొద్దని, ప్రచారం చేయవద్దని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని తెలిపారు.