రేపటి నుంచి మండలంలో యురియా పంపిణీ
NLR: సీతారామపురం మండలంలోని రైతులకు సొసైటీ ద్వారా యురియా ఎరువు అందుబాటులో ఉందని సొసైటీ ఛైర్మన్ సోమనబోయిన రాజశేఖర్ తెలిపారు. రేపు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సొసైటీ వద్ద మొత్తం 400 యురియా బస్తాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని, ఒక్క యురియా బస్తా ధర రూ.266.50 పైసలు అని స్పష్టం చేశారు.