బండి సంజయ్‌పై KTR రూ.100కోట్ల దావా!

TG: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మాజీ మంత్రి కేటీఆర్ భారీ షాకిచ్చారు. బండి సంజయ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో KTR పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. డిసెంబర్ 15న విచారణకు హాజరుకావాలని బండికి సమన్లు జారీ చేసింది. గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KTRపై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేయడంతో.. ఈ దావా వేశారు.