అంబేద్కర్ జయంతికి మంత్రికి ఆహ్వానం
ADB: అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి వివేక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్‌ను ఇంద్రవెల్లి మండల అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మెమోరియల్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు రావాలని మంత్రిని కోరారు.