షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం

షార్ట్ సర్క్యూట్‌తో గృహోపకరణాలు దగ్ధం

KDP: ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో నివాసం ఉంటున్న నూకల వెంకటసుబ్బయ్య ఇంట్లో గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. విద్యుత్ వైర్లలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కూలర్, టీవీ, ఫ్యాన్ వంటి పలు గృహోపకరణాలు కాలిపోయాయి. మంటలను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది.