నల్ల పోచమ్మ దర్శించుకున్న మాజీ ఎమ్మెల్సీ
SRD: మనూరు మండలంలోని బోరంచ నల్ల పోచమ్మ ఆలయాన్ని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కుటుంబ సభ్యులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అభిషేక పూజలు, కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్థానిక అర్చకులు సిద్దు స్వామి వారికి అమ్మవారి శేష వస్త్రాలతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది ఉన్నారు.