దర్శిలో గుర్తుతెలియని మహిళ మృతి

ప్రకాశం: దర్శిలో సోమవారం గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు స్థానిక ఏఎస్సై ఆరికాటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి - అద్దంకి రోడ్డులో గుర్తు తెలియని యాచకురాలు అపస్మారక స్థితిలో ఉండగా 108లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతి చెందిన మహిళకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవన్నారు.