ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ప్రిన్సిపల్

ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: ప్రిన్సిపల్

CTR: ఈనెల 25న పాలిసెట్ పరీక్షలు జరుగుతాయని పలమనేరు ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ సావిత్రి చెప్పారు. స్థానిక మహిళా పాలిటెక్నిక్ కాలేజ్, జడ్పీ గర్ల్స్ హైస్కూల్ రెండు సెంటర్లలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని 11 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరన్నారు.