నర్సాపూర్ మండలంలో పర్యటించిన కలెక్టర్

MDK: నర్సాపూర్ మండలలోని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆద్మాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నివాస గృహాలను పరిశీలించారు. ఆనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్ధానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.